శ్రీనివాస నగర్ కాలనీలో వైభవంగా గణపతి పూజలు

 కాప్రా సర్కిల్ లో ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే , రిటైరైన వేతనశర్మలకు నివాసముగా ఉన్న 
శ్రీనివాస నగర్ కాలనీలో వినాయకచవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీనివాసనగర్ కాలనీ
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ యూత్ అసోసియేషన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో
భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణపతి పూజ తీర్థప్రసాద వితరణ ఉంటాయి. 20వ తేదీ ఆదివారం
పిల్లలకు ఆటలపోటీలు , అన్నదానం ఉంటాయి. సోమవారం 21వ తేదీ సాయంత్రం హోమం నిర్వహించడం
జరుగుతుంది. 22వ తేదీ మంగళవారం సంగీత ,నృత్య కార్యక్రమాలు ఉంటాయి. 23వతేదీ బుధవారం సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. 25వ తేదీ అనంత చతుర్దశి శుక్రవారం లడ్డూ వేలం , గణపతి ఉద్వాసన, నిమజ్జనం ఉంటాయి.
భక్తి సంగీత కార్యక్రమంతో పాటు తెలంగాణ పోలీసు శాఖ, శ్రీనివాసనగర్ సంక్షేమ సంఘం సంయుక్తంగా
కాలనీవాసుల సురక్ష, భద్రతను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వాడకం,
హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను గురించిన అవగాహన, ప్రేరణ సమావేశాన్ని నిర్వహించారు.
డి సి పి కె. సురేష్ కుమార్, ఏ సి ఫై వై. వెంకట్ రెడ్డి, కుషాయిగూడ ట్రాఫిక్ ఇనస్పెక్టర్ సిహెచ్. నాగేందర్ రావు ,
సబ్ ఇనస్పెక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రీనివాసనగర్ గణేష్ మంటపాన్ని సందర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించిన
తరువాత సమావేశం నిర్వహించారు. శుక్రవారం కాలనీ మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. కాలనీవాసులు కలసికట్టుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు సత్యనారాయణ (నాగు), కార్యదర్శి సద్గురు చారి తెలిపారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *