
ప్యారడైజ్ అనగానే అందరికీ హైదరాబాద్ బిర్యానీ గుర్తుకొస్తుంది. గత రెండు సంవత్సరాలుగా నాచురల్ స్టార్ నాని దర్శకులు ఓదెల శ్రీకాంత్ కాంబినేషన్లో సినిమా బాగా వైరల్ అయ్యింది. కుటుంబ కథలు ప్రేమ కథలకి చిరునామాగా ఉన్న నాని దసరా నుంచి కొత్తదారిలో నడిచారు. పూర్తిగా యాక్షన్ దృశ్యాల మధ్య కథనం కనబడింది. అయితే దర్శకులు ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి సినిమా చివరి వరకు తల్లీ కొడుకుల దృశ్యాలని భావోద్వేగ పరంగా చిత్రీకరించారు. మరోవైపు సవారీ జాతి గుర్తింపు అనే అంశాన్ని కలిపారు. దర్శకుడు ఈ రెండు అంశాలను జోడించి కథనాన్ని నడిపే విషయంలో తడబడ్డట్టు కనిపిస్తుంది. అలాగే ప్రేమ దృశ్యాలని మనసుకు దగ్గరగా చూపించారు కానీ ఇంకా బలంగా స్క్రీన్ ప్లే కుదిరితే బాగుండేది. దర్శకుడు 'ప్యారడైజ్' బిర్యానీ నుంచి కథను మొదలుపెట్టారు. అది చివరివరకు ఆధిపత్య పోరుగా దృశ్యాలు నడుస్తాయి. తల్లిని అపార్ధం చేసుకునే కొడుకు చివరకు ఆమె ఆశయం కోసం పరితపించి విజయం సాధిస్తాడు. జాడల్ పాత్రలో నాని భావోద్వేగాలని బాగా పండించారు. కోపం ,విచారం, ప్రేమ ఇలా అన్నీ సమంగా ప్రదర్శించడం విశేషం. బాలీవుడ్ తార సోనాలికరిణి తల్లి పాత్రకు జీవం పోశారు. కథానాయికగా కాయాదు పాత్ర ఆకర్షిస్తుంది. మోహన్ బాబు పాత్ర పరిమితంగా ఉంది. తనికెళ్ల భరణి సంపూర్ణేష్ బాబు కేవలం తెరమీద కనబడ్డారు. ప్రాధాన్యత అంతగా లేదు. ప్రధమ భాగం కథ కథనాలని పరిచయం చేసింది. నాని కీర్తి సురేష్ పాట బాగా జనాదరణ పొందడం విశేషం. ఈ చిత్రంలో ప్రేమ కోపం విచారం భయం భావుద్వేగాలు తెరమీద సందడి చేశాయి. చిత్రం కుటుంబ కథే అయినప్పటికీ యాక్షన్ దృశ్యాలు డామినేట్ చేశాయి ప్రేక్షకులు ఆదరించే తీరు మీద చిత్ర విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్ -- డాక్టర్ దువ్వూరి శర్మ, సినీ పరిశోధకులు, 9949039175





