
తెలుగు సినీమా కథల పరిధి పెరిగింది. వివిధ జోనర్ కథలు ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. న్యూమిలీనియం ప్రారంభంలో ప్రేమకథలు వచ్చాయి. తరువాత సస్పెన్స్, చారిత్రక, హస్య, కుటుంబ కథలు తెరమీద నడిచాయి. భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర కొన్ని వందల పేజీలలో దాగి ఉంది. దర్శక రచయితలు వెండితెరపై అల్లూరి సీతారామరాజు, సర్ధార్ పాపారాయుడు, సైరా నరసింహారెడ్డిగా అప్పటి దేశభక్తుల వీరత్వం, పరిస్ధితుల్ని దృశ్యభావోద్వేగాలుగా సమర్పించారు. కానీ తాజాగా దసరా సందర్భంగా విడుదల అయిన ‘‘రణబాలి’’ అప్పటి కరువుని, బ్రిటీష్ పాలన ఆరాచకల్ని ఒక భావుకత కలిగిన కథగా అందించారు. ప్రేమ, కుటుంబ కథలకి చిరునామాగా ఉన్న విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి కాంబినేషన్ లో రణబాలిని మలిచారు. ఇది సాధారణ చిత్రంగా వీక్షిస్తే మనస్సుకి చేరదు, గానీ భారతీయత కలిగి ఉన్న ఒక వీరుడు సామాన్య ప్రజల ఆకలి తీర్చడానికి, బ్రిటీష్ కరువుని పారద్రోలడానికి రణబాలి ప్రయత్నం తెరమీద ఒక ఉద్వేగంగా నడుస్తుంది. చిత్రం అప్పటి కాలానికి వెడుతుంది. 1870 నాటి కరువుని దర్శకులు రాహుల్ చక్కగా ఆర్ట్ డిపార్ట్ మెంట్ ద్వారా సజీవతని చేకూర్చారు. నిజంగా దర్శకుని కృషి అభినందనీయం. చిత్రం అంతా రణబాలి పాత్ర చుట్టూ తిరుగుతుంది. రణబాలి భార్యగా జయమ్మ పాత్రలో రష్మిక న్యాయం చేసారు. వీరిద్దరి మధ్య దృశ్యాలు సరదా సరదగా నడిచినా… చివరికి ఆర్ధ్రత కలిగించి, మనస్సుకి కన్నీరు కలిగిస్తుంది. రష్మిక పాత్ర విషాదంగా ముగుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మమ్మీ చిత్రంలో ఆర్నల్డ్ విలన్ గా నటించారు. ఈశ్వరీరావు తనదైన ప్రతిభని మరోసారి కనబరిచారు.
రణబాలి చిత్రంలో పాటలు విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. నిజజీవితంలో భార్యభర్తలు అయిన వీరి నటనని చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. ఏందయ్య స్వామి పాట అందరికి నచ్చింది. ముగింపుని ఎవ్వరూ ఊహించరు. చిత్రంలో ప్రేమ, విషాదం, కోపం, భయం, ఇలా భావోద్వేగాలు మెరిసాయి. భారతీయతని అభిమానించే వారికి చిత్ర ఖచ్చితంగా నచ్చుతుంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రం ద్వారా విజయం సాధించారు. రణబాలి చిత్రంలో విజయ్ దేవరకొండ రౌద్ర భావోద్వేగాలని బాగా పండించారు. చిత్రబృందానికి అభినందనలు. యువతరం ప్రేక్షకులు తప్పనిసరిగా చూడవల్సిన చిత్రం ‘రణబాలి’.
—డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
అధ్యాపకులు – సినీ పరిశోధకులు, 9949039175





