గరివిడి లక్ష్మి పేరు వినగానే ఉత్తరాంధ్ర జన హృదయం పరవశించిపోతుంది. బుర్రకథ ప్రతిభ స్మరణకి వస్తుంది. ఆటపాటలతో పాటు అడుగులు వేదికపై చిందులు వేసిన క్షణాలు… అప్పటి తరానికి జ్ఞాపకంగా మెదులుతాయి. మహానటి సావిత్రి గారి జీవన చిత్రం ప్రపంచంలో ఉన్న తెలుగు, తమిళ యింకా దక్షిణాధి వారికి విపరీతంగా నచ్చింది. తరువాత ఎన్టీఆర్ గారి కథ వచ్చింది. ఇప్పడు గరివిడి లక్ష్మి గారి పాటలు, జీవనం గురించి గౌరినాయుడు దర్శకత్వంలో దసరాకి వచ్చింది. ఆనందిని నట ప్రతిభ ఈ చిత్రానికి జీవం పోసింది. పల్లె జీవనాన్ని, మట్టి వాసనల సుంగంధాల్ని, బుర్రకథల గొప్పతనాన్ని పరిచయం చేసింది. బాల్యం నుంచి జరిగిన సంఘటల్ని అన్నీ సినిమా టిక్ గా చిత్రీకరించారు. నిజానికి కనుమరుగు అయిన గరివిడి లక్ష్మి గారి ప్రతిభ పాటవాల్ని దర్శకులు ప్రపంచానికి వెండితెర ద్వారా పరిచయం చేసారు.
ఆనందిని (గరివిడి లక్ష్మి) పాత్ర తనదైన ప్రతిభ ద్వారా పాటలుగా మార్చి లయబద్ధంగా అడుగులు వేసినప్పుడు విపరీతంగా ఆ దృశ్యాలు మనస్సుకి చేరాయి. పాటలు జానపదాలు అయినప్పటికీ అవి జానపదాలుగా జనరంజకంగా నిలిచాయి. వాస్తవికత కథనాలుకి సినీరంగులు దిద్దారు. కథ, కథనాలు ప్రేమ దృశ్యాలు, ఇవాన్నీ మహానటిని గుర్తు చేసాయి. ఒక్కొక్కసారి శంకరాభరణం దృశ్యాలు స్మరణకి వస్తాయి.
సినీ పరిశ్రమలో కొన్ని సందర్భాలు అజ్ఞాత రచయితలు ప్రతిభ దాగి ఉంటుంది. తెర వెనుక వారి కృషి అలాగే ఉండిపోతుంది. విజయం, కీర్తి వేరొకరికి చెందుతుంది. గరివిడి లక్ష్మి ప్రతిభని ఆడియో కంపెనీలు, యింకా సినీ నిర్మాతలు, రచయితలు అందరూ తమ స్వార్ధం కోసం వినియోగిస్తారు.
సినిమా విశ్రాంతి తరువాత దృశ్యాలు చాలా బావున్నాయి. ఒక్కొక్కసారి విశ్వనాధ్ గారి దర్శక శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రజల అభిరుచులు మారాయి. కళాకారుల ఆర్ధిక ఇబ్బందులు ఇవన్నీ సినిమాలో కనబడతాయి. ఆనందిని ఈ సినిమాలో వందశాతం దృశ్య భావోద్వేగాలను పండించారు. ఖచ్చితంగా ప్రేక్షకుల అభినందనలుతో పాటు ఈ సినిమాకి అవార్డులు, తప్పనిసరిగా వస్తాయి. దసరా చిత్రాలులో ఇది ఒక భావ సంపెంగ పరిమిళించింది. జనానికి చేరువ అయింది.
- డా. దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ
అధ్యాపకులు, పరిశోధకులు
అమలాపురం –
సెల్ : 9949039175






