శ్రీ పరాభవ ఉగాదికి అక్షర స్వాగతం


రచన : డా. D.V.S.శర్మ


ప్రకృతి తెరల తన్మయత్వం
శీతల గాలులు వీడ్కోలు పలికిన క్షణం
మేఘం చాటున ఉషస్సుల ఉద్వేగం
చిగురులు పలికించిన తియ్యదనం
గున్నమావి నీడలో కోయిల స్వరం
సంగీత లక్ష్మికి నీరాజనం
తీపి, చేదు రుచుల సాంగత్యం
ఉగాది పచ్చడి జీవన తత్వం
నక్షత్రాలు, తిధులలో కాల ప్రయాణం
పంచాంగ శ్రవణంలో భావి ఆశల సందర్శనం
రాశులన్నీ కలబోతగా చేర్చే కలల తీరం
అక్షరాలలో, ఆలోచనల అద్భుతాల కవిత్వ భావ నైవేద్యం
వేదికలన్నీఅభిరులకి చిరునామాగా మారిన సమయం
ప్రతీ వసంతం మదిని స్పశించే నిత్య జ్ఞాపకం
పరాభవ నూతన ఉగాది అడుగులు వేసినప్పుడు
అనుభూతి లేగదూడలా ఉరకాలు వేయాలి
అనుభవం వెదురు వేణువు గానం గావాలి
అంతరంగాలు మామిడి తియ్యదనంతో ఆస్వాదించాలి
ఆనందం పసిపాప చిరునవ్వులా మెరవాలి
అద్భుతం జలధారాల వీణలా శృతిమీటాలి
ఆలోచన రంగులని చిలకరించి కుంచెలా కదలాలి
అనురాగం అమ్మ అనంతమైన ప్రేమ అడుగుల వేయాలి
శ్రీ పరాభవ
పరాజయాలకి, చెడుకి
కల్మషాలకి కలహాలకి పరాభవ మిచ్చి
ప్రతీ ఒక్కరి ఆనందాలకి నాంది కావాలి
ఉగాదికి ఊపిరి పోయాలి
**అందరికి ఉగాది శుభాకాంక్షలు**

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *