
తెలంగాణ ప్రాంత సంస్కార భారతి , చండీగఢ్ కు చెందిన ప్రాచీన్ కళా కేంద్రకు అనుబంధంగా ఏర్పాటైన సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంతోత్సవం -2026 నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల
పాటు జరిగే ఈ కళోత్సవంలో ప్రతిరోజు సాయంత్రం 5-30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ప్రారంభోత్సవం జరిగే 19వ తేదీ ఉగాది రోజు పంచాంగ శ్రవణం, తదుపరి 6-30 నుంచి సంచలన స్కూల్
ఆఫ్ డ్యాన్స్ బృందంచే ‘ఉగాది హేల’ నృత్య నాటిక ప్రదర్శన ఉంటుంది. సాకేత్ కాలనీలో డ్యాన్స్ స్కూల్ ఆవరణలో ఉన్న కళ్యాణ్ యాంఫి థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉగాది రోజు కార్యక్రమాలు డాక్టర్ బోనాల కిరణ్మయి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతాయి. ముఖ్య అతిథి పసుమర్తి ఉదయ భాస్కర్ , ప్రత్యేక అతిథి సివిల్ నరసింహా రావు , అధ్యక్షత డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ.

